విజయంతో ఆరంభం.. ప్రి క్వార్టర్స్​ ​​లోకి దూసుకెళ్లిన మేరీ కోమ్​

25-07-2021 Sun 14:44
  • 4–1 తేడాతో డొమినికా బాక్సర్ పై గెలుపు
  • ప్రి క్వార్టర్ లో ప్రపంచ మూడో ర్యాంకర్ తో బౌట్
  • టేబుల్ టెన్నిస్ లో మనికా బాత్రా ముందంజ
Mary Kom Enters Pre Quarters and Manika Batra Advances for 3rd Round

ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మెక్ మేరీ కోమ్.. 51 కిలోల విభాగం మహిళల బాక్సింగ్ లో అదరగొట్టింది. విజయంతో ఒలింపిక్స్ ను మొదలుపెట్టింది. ఇవాళ డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన హెర్నాండెజ్ గ్రేసియా మిగ్వెలినాను ఆమె.. 4–1 తేడాతో మట్టి కరిపించింది.

ఒక్క రెండో రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించి.. రౌండ్ ఆఫ్ 16ను గెలిచి ప్రి క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. కొలంబియాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ వాలెన్సియా విక్టోరియాను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ జులై 29న జరగనుంది. లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన మేరీ కోమ్ కు ఆ రౌండ్ సవాల్ తో కూడుకున్నదే.


టేబుల్ టెన్నిస్ లో మనికా బాత్రా ముందంజ వేసింది. మూడో రౌండ్ లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్ కు చెందిన మార్గరీటా పెసోస్కాను 4–3 తేడాతో ఓడించింది. రెండు మ్యాచ్ పాయింట్లను చేజార్చుకున్నప్పటికీ.. పుంజుకున్న ఆమె విజయం సాధించింది.