GVL Narasimha Rao: అప్పులు చేయడం కోసమే ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినట్టుంది: జీవీఎల్

  • ఏపీ అప్పుల ఆంధ్రప్రదేశ్ అయ్యిందన్న జీవీఎల్
  • బుగ్గనను అప్పుల మంత్రిగా పేర్కొన్న వైనం
  • అప్పుల కోసం పాట్లు పడుతున్నారని ఎద్దేవా
  • ఆడిట్ చేయించాలని కేంద్రాన్ని కోరతామని వెల్లడి
GVL comments on AP economic situation

ఏపీ రుణాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని, రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుల మంత్రి అయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అప్పుల కోసం నానా పాట్లు పడుతున్నారని, ఏపీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏ రోజుకు ఆ రోజు కొత్త అప్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టుందని వ్యాఖ్యానించారు. అసలు, అప్పులు చేయడం కోసమే ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా అనిపిస్తోందని జీవీఎల్ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించేలా ఉందని తెలిపారు.

ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల సంగతి దేశం మొత్తం తెలిసిందని, ఏపీ అప్పులపై కాగ్, రిజర్వ్ బ్యాంక్ లతో ఆడిట్ చేయాలని కేంద్రాన్ని కోరతానని వివరించారు. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఏపీ పరిస్థితులపై స్పందించారు.

More Telugu News