Police: మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకేయ‌బోయిన అమ్మాయి.. ర‌క్షించిన పోలీసులు.. వీడియో ఇదిగో

  • ఢిల్లీలో ఘ‌ట‌న‌
  • మాన‌సిక ఒత్తిడితో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
  • మెట్రో స్టేష‌న్ కింద ట్రాఫిక్ జామ్
police saves girl

మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకేయ‌బోయింది ఓ అమ్మాయి. ఆమెను గుర్తించిన పోలీసులు చివ‌ర‌కు ర‌క్షించి కింద‌కు దింపారు. ఈ ఘ‌ట‌న‌తో మెట్రో స్టేష‌న్ కింద ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఫరీదాబాద్‌ మెట్రో రైల్‌ స్టేషన్ పైకి ఎక్కిన ఓ యువ‌తి  ఆత్మహత్యాయ‌త్నం చేసింది. ఈ విష‌యంపై సమాచారం అందుకున్న ఎస్సై ధన్‌ ప్రకాశ్‌, కానిస్టేబుల్ సర్ఫ్‌రాజ్  అక్క‌డ‌కు వెళ్లారు. మెట్రో సిబ్బందితో క‌లిసి ఆ యువ‌తికి న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

స్టేషన్‌ కింద ఉన్న ఎస్సై ఆమెను మాటల్లోకి దించి  దృష్టి మరల్చాడు. ఇంతలో పైకి ఎక్కి ఆమె వ‌ద్ద‌కు వెళ్లిన‌ కానిస్టేబుల్‌ సర్ఫ్‌రాజ్ ఆ అమ్మాయిని ఒక్క‌సారిగా ప‌ట్టుకున్నాడు. అనంత‌రం ఆమెను కింద‌కు తీసుకొచ్చాడు.  ఆ అమ్మాయి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. కొంత కాలంగా మానసిక ఒత్తిడితో బాధ‌ప‌డుతోంది. ఈ కార‌ణంగానే ఆత్మహత్యాయత్నం చేసింది.

More Telugu News