క‌ర్ణాట‌క‌లో రేపు ద‌ళిత సీఎం నియామ‌కం వార్త‌ల‌పై య‌డియూర‌ప్ప స్పంద‌న‌

25-07-2021 Sun 12:18
  • ఈ రోజు సాయంత్రం పార్టీ అధిష్ఠానం నుంచి సూచ‌న‌లు
  • ఆ స‌మ‌యంలోనే మీడియాకి కూడా ఈ విష‌యం తెలుస్తుంది
  • ఇందులో నా జోక్యం లేదు  
Im not concerned about it CM BS Yediyurappa

త‌న భ‌విష్య‌త్తుపై నేడు బీజేపీ అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఇటీవ‌ల క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డియూర‌ప్ప స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆయ‌న ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వివ‌ర‌ణ ఇచ్చారు. 'ఈ రోజు సాయంత్రం పార్టీ అధిష్ఠానం నుంచి ఈ విష‌యంపై సూచ‌న‌లు వ‌స్తాయ‌ని నేను భావిస్తున్నాను. ఆ స‌మ‌యంలోనే మీడియాకి కూడా ఈ విష‌యం తెలుస్తుంది' అని య‌డియూర‌ప్ప తెలిపారు.

క‌ర్ణాట‌క‌లో ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి చేస్తార‌న్న ప్రచారంపై కూడా య‌డియూర‌ప్పను మీడియా ప్ర‌శ్నించింది. దీనిపై ఆయ‌న స్పందిస్తూ...  'పార్టీ అధిష్ఠానం దీనిపై నిర్ణ‌యం తీసుకుంటుంది. ఇందులో నా జోక్యం లేదు' అని వ్యాఖ్యానించారు. కాగా, రేపు య‌డియూర‌ప్ప రాజీనామా చేస్తార‌ని, కొత్త సీఎం నియామ‌కం జ‌రగ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.