Mamallapuram: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి, బిగ్‌బాస్ ఫేమ్ యషిక పరిస్థితి విషమం

actress yashika anand met with a terrible car accident near mamallapuram
  • చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో ఘటన
  • అక్కడికక్కడే మృతి చెందిన వల్లిశెట్టి భవానీ
  • మద్యం మత్తులో వేగంగా కారు నడపడమే కారణమన్న పోలీసులు
తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్ ఫేమ్ యషికా ఆనంద్ సహా ఇద్దరు గాయపడ్డారు. యషిక స్నేహితురాలైన హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వల్లిశెట్టి భవాని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన యషికతోపాటు మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం చెన్నై తరలించారు.

అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యషిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బిగ్‌బాస్ షోతో ఫేమస్ అయిన యషిక మోడల్‌గానూ రాణిస్తోంది.
Mamallapuram
Tamil Nadu
Road Accident
Yashika Anand

More Telugu News