Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ అప్‌డేట్.. తొలి పోరులో నెగ్గిన పీవీ సింధు

Tokyo Olympics PV Sindhu off to winning start
  • ఇజ్రాయెల్ క్రీడాకారిణి సేనియాపై వరుస గేముల్లో విజయం
  • ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు నిరాశ
  • ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన మనుబాకర్, యశస్విని
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన సేనియా పోలికార్పోవా విజయం సాధించింది. 21-7, 21-10తో రెండు వరుస గేముల్లో గెలుపొందింది. 29 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం గమనార్హం.

మరోవైపు, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. మనుబాకర్, యశస్విని ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. మనుబాకర్ 12వ స్థానం, యశస్విని 13వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
Tokyo Olympics
PV Sindhu
Badminton
Ksenia Polikarpova

More Telugu News