పూరి ప్రాజెక్టును ముందుకుతెస్తున్న బాలయ్య?

24-07-2021 Sat 18:37
  • క్లైమాక్స్ షూట్లో 'అఖండ'
  • నెక్స్ట్ ప్రాజెక్టు గోపీచంద్ మలినేనితో
  • అనిల్ రావిపూడి ప్రాజెక్టు ఆలస్యం
  • పూరికి గ్రీన్ సిగ్నల్      
Anil Ravipudi next movie will be late with Balakrishna

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమా 'అఖండ'తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ తమిళనాడులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో షూటింగు పార్టు పూర్తవుతుంది. కుదిరితే దసరాకి ముందుగా, లేదంటే సంక్రాంతి రోజుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే మిగతా పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేయనున్నారు. ఇది కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గానే రూపొందనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను పూర్తిచేసుకుని గోపీచంద్ మలినేని సిద్ధంగా ఉన్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును అనిల్ రావిపూడితో చేయాలని బాలకృష్ణ భావించారు. అయితే బాలకృష్ణ చెప్పిన మార్పులు చేర్పులు చేయడానికి ఆయనకి కొంత సమయం పట్టనుంది.

అందువలన పూరి స్పీడ్ గురించి తెలిసిన బాలకృష్ణ, ముందుగా ఆయన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అంటే పూరి సినిమా తరువాతనే అనిల్ రావిపూడి ప్రాజెక్టు ఉంటుందన్న మాట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'పైసా వసూల్' వచ్చిన సంగతి తెలిసిందే.