ఏపీలో కరోనా కేసుల తాజా వివరాలు ఇవిగో!

24-07-2021 Sat 18:34
  • గత 24 గంటల్లో 74,820 కరోనా పరీక్షలు
  • 2,174 మందికి పాజిటివ్
  • తూర్పు గోదావరి జిల్లాలో 418 కేసులు
  • కర్నూలు జిల్లాలో 8 కేసులు
  • రాష్ట్రంలో 18 మంది మృతి 
Here it is AP Corona daily cases bulletin

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 74,820 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,174 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 418 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 329, కృష్ణా జిల్లాలో 248, నెల్లూరు జిల్లాలో 246, ప్రకాశం జిల్లాలో 233, పశ్చిమ గోదావరి జిల్లాలో 209 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 2,737 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,241కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 19,52,513 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,16,914 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 22,358 మంది చికిత్స పొందుతున్నారు.