అమరావతి అనేది ఓ కుంభకోణమని అందరికీ తెలుసు: సజ్జల

24-07-2021 Sat 18:07
  • ఇటీవల ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో సుప్రీం తీర్పు
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని వెల్లడి
  • అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న సజ్జల
  • తమ ప్రభుత్వ అభిప్రాయం అదేనని వెల్లడి
 Sajjala comments on Insider Trading

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదన్న హైకోర్టు తీర్పును ఇటీవలే సుప్రీంకోర్టు కూడా బలపర్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఓ కుంభకోణమని అందరికీ తెలుసని అన్నారు. తమ ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పునరుద్ఘాటించారు. అమరావతి కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో సాంకేతిక అంశాలపై ఆధారపడే కోర్టు తీర్పు వచ్చిందని, ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం ఉపయోగించడం సాంకేతికంగా అభ్యంతరకరం అయితే, మరో కోణంలో వాస్తవాలు వెలుగుచూస్తాయని సజ్జల పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లు మాత్రం తప్పించుకోలేరని స్పష్టం చేశారు.