'ఇష్క్' రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు: హీరో తేజ సజ్జ

24-07-2021 Sat 18:02
  • ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు
  • ఎక్కడా బోర్ కొట్టదు  
  • కొత్త ట్రీట్మెంట్ తో సాగుతుంది
  • అన్ని పాటలు ఆకట్టుకుంటాయి
Teja Sajja felt lucky for doing Ishq movie

తేజ సజ్జ కథానాయకుడిగా 'ఇష్క్ .. నాట్ ఏ లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. ఈ సినిమాతో ఎస్.ఎస్. రాజు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా ప్రకాశ్ వారియర్ నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కి .. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ .. "అందరూ అనుకుంటున్నట్టుగా ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. కొత్త కథ .. కొత్త ట్రీట్మెంట్ తో ఈ సినిమా సాగుతుంది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రేమకథగా కనిపించినప్పటికీ, ఫ్యామిలీతో పాటు చూడదగిన సినిమా ఇది. కథ .. పాత్రలు ఎక్కడా కూడా పరిధిని దాటి వెళ్లవు.

ఈ సినిమా మొదటి నుంచి చివరివరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది .. ఎక్కడా బోర్ అనిపించదు. ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి. మహతి స్వరసాగర్ అందించిన పాటలు అందరికీ కనెక్ట్ అవుతాయి. ఈ కథ నా వరకూ రావడం నేను చేసుకున్న అదృష్టం. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.