Kasturi Rangan: సీఎం జగన్ చేపడుతున్న విద్యాసంస్కరణలపై కస్తూరి రంగన్ స్పందన

NEP Chairman Kasturi Rangan appreciates CM Jagan on educational reforms
  • 'వర్సిటీ డిస్టింగ్విష్ లెక్చర్' లో పాల్గొన్న ఎన్ఈపీ చైర్మన్
  • ఏపీ విద్యాసంస్కరణలు వివరించిన మంత్రి ఆదిమూలపు
  • సీఎం జగన్ ను అభినందించిన చైర్మన్
  • ఏపీ ప్రథమస్థానంలో ఉందని వెల్లడి
ఏపీలో సీఎం జగన్ చేపడుతున్న విద్యాసంస్కరణలపై జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ స్పందించారు. సీఎం జగన్ నాయకత్వంలో విద్యా సంస్కరణలు సమర్థవంతంగా అమలవుతున్నాయని కొనియాడారు. కరోనా సంక్షోభ సమయంలోనూ విద్యా సంస్కరణల అమలుకు నిధులు సమకూర్చుతూ, పలు విద్యా పథకాలను కచ్చితంగా అమలు చేస్తున్నారని అభినందించారు. ఎన్ఈపీ-2020 అమలులో ఏపీనే ప్రథమస్థానంలో ఉందని కస్తూరి రంగన్ వెల్లడించారు. ఖర్చుకు వెనుకాడకుండా విద్యాసంస్కరణలు ముందుకు తీసుకెళుతున్న తీరు ప్రశంసనీయమని అన్నారు.

వర్సిటీ డిస్టింగ్విష్ లెక్చర్ కార్యక్రమంలో కస్తూరి రంగన్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీలో అమలు చేస్తున్న విద్యాపరమైన సంస్కరణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు.
Kasturi Rangan
NEP Chairman
CM Jagan
Educational Reforms
Andhra Pradesh

More Telugu News