"రామ్ చరణ్ ఇంటి ముందు ఎన్టీఆర్ లాంబోర్ఘిని కారు"... వివరణ ఇచ్చిన మహేశ్ కోనేరు!

24-07-2021 Sat 17:14
  • సోషల్ మీడియాలో పోస్టులు
  • రామ్ చరణ్ ఇంటి ముందు ఖరీదైన కారు
  • అది ఎన్టీఆర్ దేనంటూ ప్రచారం
  • అందులో వాస్తవం లేదన్న మహేశ్ కోనేరు
NTR manager Mahesh Koneru clarifies car at Ram Charan house

సోషల్ మీడియా వచ్చాక ఏ విషయమైనా అమితవేగంతో పాకిపోతుంది. తాజాగా, హైదరాబాదులో రామ్ చరణ్ ఇంటిముందు జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లాంబోర్ఘిని కారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్లపై విపరీతమైన మక్కువ ప్రదర్శించే ఎన్టీఆర్ రూ.5 కోట్ల విలువైన లాంబోర్ఘిని ఉరుస్ మోడల్ కారు కొనేశాడని, మొట్టమొదటిగా తన స్నేహితుడు రామ్ చరణ్ ఇంటికి కొత్త కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎన్టీఆర్ మేనేజర్ మహేశ్ కోనేరు వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా పోస్టుల్లో కనిపిస్తున్న కారు ఎన్టీఆర్ ది కాదని తెలిపారు. అయితే, ఎన్టీఆర్ లాంబోర్ఘిని ఉరుస్ మోడల్ ను బుక్ చేసింది నిజమేనని, ఆ కారు ఇటలీ నుంచి భారత్ కు వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని వివరించారు. కాగా, ఇటీవలే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంబోర్ఘిని కారును కొనుగోలు చేశాడు. దాని ఖరీదు రూ.4 కోట్లని తెలుస్తోంది.