రాజీనామాలు చేయడం వారి ఇష్టం.. మమ్మల్ని అడగడం ఎందుకు?: సజ్జల
- గతంలో మేము రాజీనామాలు చేసినప్పుడు టీడీపీని అడిగామా?
- టీడీపీ హయాంలో ఎంత మంది సలహాదారులు ఉండేవారనే లెక్కలు తీస్తున్నాం
- అమరావతి భూవ్యవహారం పెద్ద స్కామ్
తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంత మంది ప్రభుత్వ సలహాదారులు, కన్సల్టెంట్లు ఉండేవారనే లెక్కలు తీస్తున్నామని సజ్జల చెప్పారు. ఆ రోజుల్లో కుటుంబరావు, పరకాల ప్రభాకర్ వంటివారు రాజకీయాలు మాట్లాడారని... అప్పుడు అది తప్పుగా అనిపించలేదా? అని ప్రశ్నించారు. అమరావతి భూవ్యవహారం పెద్ద స్కామ్ అని... ఆ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనే విషయం కూడా అందరికీ తెలుసని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఉపయోగించడం వల్ల సాంకేతికంగా సమస్య ఉత్పన్నమైందని, అందువల్లే సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని అన్నారు. అయితే వాస్తవాలు మరో కోణంలో బయటకు వస్తాయని.. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని చెప్పారు.