ఈ ఆందోళనలన్నీ తుది దశ ఉద్యమానికి సంకేతాలు!: రేవంత్ రెడ్డి హెచ్చరిక
- తెలంగాణ భవన్ ఉద్యోగాల్లో వివక్షపై ఆగ్రహం
- కేసీఆర్ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్యాయం
- 'సిద్ధంగా ఉండు కేసీఆర్' అంటూ హెచ్చరిక
‘‘మన ఉద్యోగాలు మనకు కావాలన్న ఉద్యమ ఆకాంక్షలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కేసీఆర్ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్యాయం ఎన్నో రెట్లు ఎక్కువైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ బిడ్డలకు ఎదురవుతున్న వివక్షే అందుకు నిదర్శనం. ఈ ఆందోళనలన్నీ తుది దశ ఉద్యమానికి సంకేతాలు. సిద్ధంగా ఉండు కేసీఆర్’’ అంటూ ఆయన హెచ్చరించారు.