‘బిచ్చగాడు 2’ నుంచి ఆసక్తికరమైన ఫస్ట్​ లుక్​

24-07-2021 Sat 14:35
  • స్వీయ దర్శకత్వంలో హీరోగా విజయ్ ఆంటోనీ
  • నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విజయ్  
  • వెల్ కమ్ చెప్పిన డైరెక్టర్ మురుగదాస్
Vijay Antony Releases First Look Of Bichagadu 2

సూపర్ హిట్ ‘బిచ్చగాడు’కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘బిచ్చగాడు 2’. ఇందులో విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తనే నిర్మిస్తూ, తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకుడిగానూ అవతారమెత్తాడు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు ఆయన విడుదల చేశాడు. తన మనసుకు నచ్చిన ప్రాజెక్టుకు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు.

ఈ సందర్భంగా ఈయనకు మరో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అభినందనలు తెలిపాడు. ‘‘దర్శకుల కుటుంబానికి స్వాగతం డైరెక్టర్ విజయ్. ‘బిచ్చగాడు 2’ 2022లో భారీ బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేశాడు.