ప్రభాస్​ పాన్​ ఇండియా ‘ప్రాజెక్ట్​ కె’ ప్రారంభం.. ముఖ్య పాత్రలో బిగ్​ బీ!

24-07-2021 Sat 14:05
  • హైదరాబాద్ లో పూజా కార్యక్రమం
  • ముహూర్తపు షాట్ అమితాబ్ పైనే
  • సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సినిమా
Prabhas Starts Project K

ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు రెడీ అయిపోతున్నాడు. ‘ప్రాజెక్ట్ కె’ అంటూ ముందుకొస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. దానికి ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇవ్వాళ గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి చిత్రాన్ని ప్రారంభించారు.

వేడుకలో ప్రభాస్ తో పాటు బిగ్ బీ అమితాబ్ పాల్గొన్నారు. ముహూర్తపు షాట్ ఆయన మీదే తీశారు. కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. తొలి షాట్ కు ప్రభాస్ క్లాప్ కొట్టాడు. వైజయంతీ మూవీస్ , ప్రభాస్ ఈ విషయాన్ని తెలియజేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ కొత్త గెటప్ లో కనిపిస్తాడని సమాచారం. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో దీపికా పదుకొణేను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్ ప్లేను పర్యవేక్షిస్తారు.