Chandini: తమిళనాడు మాజీ మంత్రికి షాకిచ్చిన సినీ నటి చాందిని

Actress Chandini demands Rs 10 Cr from ex minister Manikantan
  • రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ పిటిషన్
  • సహజీవనం చేసి మోసం చేశాడని ఆరోపణ
  • నెలవారీ ఖర్చులు కూడా చెల్లించాలని కోర్టుకు విన్నపం
అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి మణికంఠన్ కు తమిళ సినీ నటి చాందిని షాక్ ఇచ్చారు. తనకు రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్తే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేసి మోసం చేశారని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇంతకు ముందు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో మణికంఠన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది.

మరోవైపు స్థానిక సైదాపేట కోర్టులో చాందిని మరో కేసు దాఖలు చేశారు. తనకు రూ. 10 కోట్ల పరిహారాన్ని మణికంఠన్ చెల్లించాలని... దీనికి తోడు చెన్నైలో ఉండి కోర్టు వ్యవహారాలను తాను చూసుకోవాలని, అందువల్ల దీనికి అయ్యే నెలవారీ ఖర్చులను కూడా ఆయనే చెల్లించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై ఆగస్ట్ 5న కోర్టు విచారణ చేపట్టనుంది.
Chandini
Kollywood
Tamil Nadu
AIADMK
Manikantan

More Telugu News