Sharmila: కేసీఆర్ గారి కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ బాధ్యతను గుర్తు చేసే చిన్న వీడియో కానుక: ష‌ర్మిల‌

sharmila slams ktr
  • నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని మీకు భ‌గ‌వంతుడు ఇవ్వాలి
  •  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి
  • 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి
తెలంగాణ మంత్రి కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు వైఎస్ ష‌ర్మిల‌. వనపర్తి పట్టణానికి చెందిన లావణ్య అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే చనిపోతున్నట్టు ఆమె చనిపోయే ముందు తీసుకున్న వీడియోలో చెప్పిందని ఆమె పేర్కొన్నారు.

'కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు.. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను ఇవ్వాలి' అని ష‌ర్మిల ట్వీట్ చేశారు.

'54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీఎంబ‌ర్స్‌మెంట్  ఇచ్చే మనసుని ఇవ్వాలని కోరుకొంటున్నాను. మీ బాధ్యతను గుర్తుచేసె చిన్న వీడియో కానుక' అని ష‌ర్మిల పేర్కొన్నారు.
Sharmila
YSRTP
Telangana
KTR

More Telugu News