Venkatesh Daggubati: 'నారప్ప' తప్ప నాకు వెంకటేశ్ కనిపించలేదు: చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi appreciated Venkatesh
  • 'నారప్ప' చూసిన చిరూ   
  • వెంకటేశ్ గొప్పగా చేశారు 
  • ఆయన గర్వించే సినిమా ఇది
  • చిరూకి థ్యాంక్స్ చెప్పిన వెంకీ    
వెంకటేశ్ కథానాయకుడిగా రూపొందిన 'నారప్ప' ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథాకథనాల పరంగా ఈ సినిమా అన్నివర్గాలవారిని ఆకట్టుకుంది. ఒక వైపున తనకి ఉన్న కొద్దిపాటి భూమిని కాపాడుకోవాలి .. మరో వైపున తన భార్యాబిడ్డలను రక్షించుకోవాలి అని ఆరాటపడే 'నారప్ప' పాత్రలో వెంకటేశ్ అద్భుతంగా నటించాడనే ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా తన స్పందనను తెలియజేశారు. 'నారప్ప' సినిమాను చూశాను .. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ఇది. తెరపై నాకు 'నారప్ప' తప్ప ఎక్కడా వెంకటేశ్ కనిపించలేదు. ఆయన ఆ పాత్రను లోతుగా అర్థం చేసుకున్న తీరు .. సన్నివేశాలను పండించిన విధానం గొప్పగా ఉన్నాయి. వెంకటేశ్ కెరియర్లో గర్వంగా చెప్పుకునే సినిమా ఇది" అని అన్నారు.

చిరంజీవి అభినందనల పట్ల వెంకటేశ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. "మీ ప్రతి మాట నాకు ఎంతో ఆనందాన్నీ .. సంతృప్తిని కలిగించాయి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు. ఇక ఇదే విధంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, ఈ సినిమాలో వెంకటేశ్ నటనను ప్రస్తావిస్తూ ప్రశంసలను అందజేస్తున్నారు.
Venkatesh Daggubati
Priyamani
Srikanth Addala

More Telugu News