తెలంగాణలో కొత్తగా 643 కరోనా పాజిటివ్ కేసులు

23-07-2021 Fri 20:29
  • గత 24 గంటల్లో 1,20,530 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీలో 77 కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 767 మంది
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 9,729 మందికి చికిత్స
Corona positive cases details

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,530 కరోనా పరీక్షలు నిర్వహించగా, 643 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 77, కరీంనగర్ జిల్లాలో 68, ఖమ్మం జిల్లాలో 57, వరంగల్ అర్బన్ జిల్లాలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 767 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,778కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,40,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,26,505 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,729 మంది చికిత్స పొందుతున్నారు.