కేటీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో ప్రత్యేక గీతం రూపొందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

23-07-2021 Fri 18:35
  • రేపు కేటీఆర్ జన్మదినం
  • కొన్నిరోజుల నుంచి వేడుకలు
  • అభిమానాన్ని చాటుకున్న ఎమ్మెల్సీ రాజు
  • కేటీఆర్ పై పాటను ఆవిష్కరించిన ఎంపీ సంతోష్
MLC Shambipur Raju makes a specilal song in the wake of KTR birthday

ఈ నెల 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు గత కొన్నిరోజుల ముందే వేడుకలు షురూ చేశాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. కేటీఆర్ ఘనతలను వర్ణిస్తూ ఓ ప్రత్యేక గీతం రూపొందించారు.

"కదిలే కదిలే..." అని సాగే ఈ పాటను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గతేడాది కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్ అర్ధాంగి ఓ పాటను రూపొందించారు.