సూపర్ హీరోగా కనిపించనున్న రానా?

23-07-2021 Fri 18:21
  • వివిధ భాషల్లో రానాకి క్రేజ్ 
  • సూపర్ హీరో కాన్సెప్ట్ పై దృష్టి 
  • దీనిపై ఒక స్టార్ డైరెక్టర్ కసరత్తు  
Rana is seen as a Super Hero

సాధారణంగా సూపర్ హీరో సినిమాలు హాలీవుడ్ లో ఎక్కువగా రూపొందుతూ ఉంటాయి. ఇక బాలీవుడ్లో హృతిక్ రోషన్ ఈ తరహా సినిమాలతో అలరించాడు. తెలుగులో జానపద సినిమాల్లో తప్ప .. ఈ తరహా కంటెంట్ ఎక్కడా కనిపించదు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వలన ఈ తరహా సినిమాలను నిర్మించడానికి ఇప్పుడు అవకాశాలు ఏర్పడ్డాయి.

అందువల్లనే సూపర్ హీరో కంటెంట్ ను ప్రేక్షకులు మెచ్చేలా .. వాళ్లకి విస్మయాన్ని కలిగించే విధంగా ఇప్పుడు అందించవచ్చు. అయితే భారీస్థాయిలో గ్రాఫిక్స్ అవసరమవుతాయి. పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తేనే ఆ సినిమా వర్కౌట్ అవుతుంది. ఇక హీరో కూడా మంచి ఒడ్డూపొడుగూ .. ఫిట్ నెస్ తో ఉండాలి. అప్పుడే ఆయన చేసే సాహసాలు తేలిపోకుండా, నమ్మడానికి అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ఈ తరహా సినిమా చేయడానికి రానా రంగంలోకి దిగాడనే వార్త తాజాగా షికారు చేస్తోంది. ఒక స్టార్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టును సెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. బలమైన కథాకథనాలతోనే  ఆయన రంగంలోకి దిగుతున్నాడని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.