Chandrababu: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరుకు సీఎం జగన్ నేతృత్వం వహించాలి: చంద్రబాబు

  • విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీకి చంద్రబాబు లేఖ
  • ఉద్యమాన్ని జగన్ ముందుండి నడిపించాలని సూచన
  • ఐక్యపోరాటం అవసరమని ఉద్ఘాటన
  • టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధమని వెల్లడి
Chandrababu suggests CM Jagan should lead Visakha steel plant movement

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం ఖాయమని కేంద్రం పార్లమెంటు సాక్షిగా చెప్పిన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలకు లేఖ రాశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి సీఎం జగన్ నేతృత్వం వహించాలని పేర్కొన్నారు. సీఎం జగన్ ముందుండి ఉద్యమాన్ని నడిపించాలని సూచించారు. ఐక్య పోరాటం వల్లే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలమని స్పష్టం చేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధమని చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్టు వెల్లడించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ప్లాంట్ సాధించారని, ఎన్నో అవాంతరాలను అధగమించి 1992లో ప్లాంట్ ను దేశానికి అంకితం చేశారని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో రూ.4 వేల కోట్లకు ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధపడిందని, తాను అభ్యర్థించడం, ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో రూ.1,333 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని వివరించారు.

More Telugu News