వివేకా హత్య కేసులో వాచ్ మన్ రంగన్న వాంగ్మూలం నమోదు

23-07-2021 Fri 18:00
  • 2019లో వైఎస్ వివేకా హత్య
  • ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న మర్డర్ కేసు
  • సీబీఐ దర్యాప్తు వేగవంతం
  • త్వరలో కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం
CBI records watchman Ranganna statement

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ జమ్మలమడుగు న్యాయస్థానంలో జడ్జి ఎదుట వాచ్ మన్ రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. రంగన్న ఈ కేసుకు సంబంధించి ఎంతో కీలక సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది.

కాగా, గత నెలన్నర రోజులుగా కడప జిల్లాలోనే మకాం వేసిన సీబీఐ అధికారులు ప్రతిరోజూ కొందరు అనుమానితులను ప్రశ్నిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరుగురిపైనే సీబీఐ దృష్టి సారించినట్టు అర్థమవుతోంది. వారిలో వివేకా ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పీఏ కృష్ణారెడ్డి, వాచ్ మన్ రంగన్న, పులివెందులకు చెందిన కృష్ణయ్య కుటుంబం, ఇనాయతుల్లాలను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు.