కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

23-07-2021 Fri 17:58
  • కాంట్రాక్టు లెక్చరర్ల కాంట్రాక్టును మరో ఏడాది పెంచిన ప్రభుత్వం
  • 2021-22 విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్టు పొడిగింపు
  • 719 మంది లెక్చరర్లకు చేకూరనున్న లబ్ధి
AP govt extends contract of contract degree college lecturers

డిగ్రీ కాలేజీలలో కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి కాంట్రాక్టును మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులను వెలువరించింది. వీరి సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను వీరి సేవలను పొడిగిస్తున్నట్టు తెలిపింది. జూన్ 2021 నుంచి 10 రోజుల పాటు వీరి సేవలకు విరామం ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో పని చేస్తున్న 719 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు మరో ఏడాది పని చేసే అవకాశం లభిస్తుంది.