సమంత చేతుల మీదుగా అలీ మూవీ సాంగ్ రిలీజ్!

23-07-2021 Fri 17:55
  • అలీ హీరోగా వినోదభరిత చిత్రం 
  • కథానాయికగా మౌర్యాని పరిచయం 
  • ప్రత్యేక పాత్రలో మంజుభార్గవి 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
Andaru Bagundali Andulo Nenundali 3rd song is launched by Samantha

అలీ మంచి కమెడియన్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.  చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అలీ, ఆ తరువాత కమెడియన్ గా చాలా సినిమాలలో నటించాడు. ఆ తరువాత హీరోగా కూడా కొన్ని విజయాలను అందుకున్నాడు. అలీ ఏది చేసినా తనని నిలబెట్టిన కామెడీని మాత్రం మరిచిపోలేదు. అలా అలీ సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని నిర్మాతగా మారిపోయాడు.

తన సొంత బ్యానర్ పై ఆయన 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' అనే టైటిల్ తో ఒక సినిమాను నిర్మించాడు. ఈ సినిమాతో శ్రీపురం కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మొదటి సాంగును ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించిన అలీ, మూడో సాంగును సమంత చేతుల మీదుగా రిలీజ్ చేయించాడు. రాకేశ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమాతో కథానాయికగా మౌర్యాని పరిచయమవుతోంది. టాలీవుడ్ లోని చాలామంది హాస్య నటులు ఈ సినిమాలో నటించారు. సీనియర్ నరేశ్ .. తనికెళ్ల భరణి .. ఎల్బీ శ్రీరామ్ .. పృథ్వీ .. సప్తగిరితో పాటు, మంజుభార్గవి కూడా నటించడం విశేషం. హీరోగా అలీ క్రేజ్ ను పెంచిన ఎస్వీ కృష్ణారెడ్డి - అచ్చిరెడ్డి కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.