100 పరుగులు దాటిన టీమిండియా స్కోరు

23-07-2021 Fri 16:24
  • 49 పరుగులకు ఔటైన పృథ్వి షా
  • 41 పరుగులతో ఆడుతున్న సంజు శాంసన్
  • భారత్ స్కోరు 17 ఓవర్లకు 110 పరుగులు
Prithvi Shah and Sanju Samson takes India to cross 100 runs

శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. 17 ఓవర్లకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ ను శిఖర్ ధావన్, పృథ్వీ షా ఆరంభించారు. అయితే మూడో ఓవర్లోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. 11 బంతుల్లో 13 పరుగులు చేసిన కెప్టెన్ ధావన్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

అనంతరం పృథ్వీ షాకు సంజు శాంసన్ జత కలిశాడు. వీరిద్దరూ కలిసి భారత ఇన్నింగ్స్ ను నిర్మించారు. స్కోరు బోర్డును సెంచరీ దాటించారు. అయితే 49 బంతుల్లో 49 పరుగులు చేసిన పృథ్వీ షా శనక బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. ప్రస్తుతం సంజు శాంసన్ (41), మనీశ్ పాండే (0) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ చెరో వికెట్ తీశారు.