అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం... ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన

23-07-2021 Fri 16:16
  • వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • పలు జిల్లాల్లో భారీ వర్షాలు
  • తీరం వెంట 40 కిమీ వేగంతో గాలులు
  • మత్స్యకారులకు హెచ్చరిక
Rain forecast for AP for three days

వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఈ నెల 26 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.