Sensex: వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండటం మన మార్కెట్లపై కూడా పాజిటివ్ ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 138 పాయింట్లు లాభపడి 52,975కి చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 15,856 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (3.18%), ఐటీసీ లిమిటెడ్ (2.56%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.69%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.42%), యాక్సిస్ బ్యాంక్ (1.27%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-0.82%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.74%), ఎన్టీపీసీ (-0.67%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.55%), ఏసియన్ పెయింట్స్ (-0.54%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News