Tokyo Olympics: ఒలింపిక్స్​ గ్రామంలో వంద దాటిన కరోనా కేసులు!

  • తాజాగా మరో 19 మందికి పాజిటివ్
  • మొత్తంగా 106 మందికి మహమ్మారి
  • రద్దు చేయాలన్న డిమాండ్ తో ప్రజల ఆందోళన
Covid Cases In Olympics Village Crosses 100

ఒలింపిక్స్ గ్రామంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో 19 మందికి పాజిటివ్ గా తేలినట్టు ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ ఇవ్వాళ ప్రకటించింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య వంద దాటేసింది. పాజిటివ్ వచ్చిన వారిలో ముగ్గురు క్రీడాకారులు, 10 మంది సిబ్బంది, ముగ్గురు మీడియా సిబ్బంది, మరో ముగ్గురు ఈవెంట్ కాంట్రాక్టర్లున్నారని కమిటీ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 106కు పెరిగిందని వెల్లడించింది. చెక్ రిపబ్లిక్ కు చెందిన నాలుగో క్రీడాకారుడికి పాజిటివ్ వచ్చింది. మొత్తంగా ఆ దేశానికి చెందిన ఆరుగురు కరోనా బారిన పడ్డారని, ఒలింపిక్స్ విలేజ్ లో ఆ దేశానివే ఎక్కువ కేసులని పేర్కొంది.

కాగా, కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఒలింపిక్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జపాన్ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగే వేదిక వద్దకు వెళ్లి నిరసనలు చేశారు. ఒలింపిక్స్ జ్యోతిని తీసుకొస్తున్న సందర్భంగా ప్రజలు టోక్యో మెట్రోపాలిటన్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. అయితే, తమ ఆందోళనలను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఒలింపిక్స్ జరిగే స్టేడియాల వద్దకు వెళ్లనివ్వట్లేదని వారు చెబుతున్నారు.

More Telugu News