మూసీ నది మరోసారి ఉప్పొంగుతోంది... చూసి ఆస్వాదించండి: నాగార్జున
- తెలంగాణలో భారీ వర్షాలు
- పొంగిపొర్లుతున్న వాగువంకలు
- గండిపేటకు భారీగా నీరు
- పదేళ్ల తర్వాత గేట్లు ఎత్తారన్న నాగ్
దీనిపై అగ్రహీరో నాగార్జున స్పందించారు. పదేళ్ల తర్వాత గండిపేట రిజర్వాయర్ గేట్లు ఎత్తారని వెల్లడించారు. మూసీ నది మరోసారి జలకళ సంతరించుకుందని తెలిపారు. ప్రజలు చూసి ఆస్వాదించవచ్చని, అయితే, దాంతో ఆటలాడొద్దని స్పష్టం చేశారు. నాగ్ మూసీ నదికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు.