V.V Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పిటిష‌న్‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ

  • విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పిటిష‌న్‌
  • కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన లక్ష్మీనారాయ‌ణ
  • కౌంట‌ర్‌కు వారం రోజుల గ‌డువుకోరిన కేంద్ర స‌ర్కారు
  • అభ్యంత‌రాలు తెలిపిన పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది
trial in high court on jdl petition

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయ‌ణ ఏపీ హైకోర్టులో వేసిన పిటిష‌న్‌పై ఈ రోజు విచార‌ణ జ‌రిగింది. అయితే, విచార‌ణ ప్రారంభ‌మైన అనంత‌రం దీనిపై కౌంట‌ర్ దాఖ‌లుకు వారం రోజుల స‌మ‌యం  ఇవ్వాల‌ని న్యాయ‌స్థానాన్ని కేంద్ర ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది కోరారు.

దీంతో కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై లక్ష్మీనారాయ‌ణ త‌ర‌ఫు న్యాయ‌వాది అభ్యంత‌రాలు తెలిపారు. కౌంట‌ర్ దాఖ‌లు విష‌యంలో కేంద్ర స‌ర్కారు తాత్సారం చేస్తోంద‌ని అన్నారు. మరోపక్క, ఈ నెల 29న బిడ్డింగ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంద‌ని వివ‌రించారు. దీంతో బిడ్డింగ్ పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, బిడ్డింగ్ వంటివి ఉండ‌బోవ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. దీంతో ఆగ‌స్టు 2 లోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను అదే రోజు చేప‌డ‌తామ‌ని చెప్పి, వాయిదా వేసింది.

More Telugu News