Shilpa Shetty: తన భర్త అరెస్ట్ అయిన తర్వాత తొలిసారి స్పందించిన శిల్పా శెట్టి

Shilpa Shetty first response after her husbands arrest
  • పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా
  • జేమ్స్ థర్బర్ పుస్తకంలోని వాక్యాలను షేర్ చేసిన శిల్ప
  • 2009లో పెళ్లి చేసుకున్న శిల్ప, రాజ్ కుంద్రా
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు. తన భర్త అరెస్టైన తర్వాత శిల్పాశెట్టి తొలిసారి స్పందించింది. ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ రచించిన పుస్తకంలోని వాక్యాలను ఆమె ఇన్స్టాలో షేర్ చేసింది.

'కోపంలో ఉన్నప్పుడు వెనక్కి చూడకు, భయంగా భవిష్యత్తును చూడకు, పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు అంటాడు జేమ్స్ థర్బర్. మనల్ని బాధ పెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాం. ఉద్యోగం పోతుందేమో అనే భయంతోనో, ఏదైనా రోగం బారిన పడతామనో, మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తును చూస్తాం.

నేను బతికే ఉన్నాననే విషయం తెలుసుకుని దీర్ఘంగా ఊపిరి తీసుకుంటా. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కొంటా. ఈరోజు నేను జీవించడాన్ని ఏ శక్తి కూడా ఆపలేదు' అనే వాక్యాలను ఆమె షేర్ చేసింది.

గత సోమవారం రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యారు. 2009లో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ప్రజల్లో ఫిట్ నెస్ పై అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది. తన యోగా వీడియోలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 'సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 3' రియాల్టీ షోకు జడ్జిగా వ్యవహరించింది. ఆమె నటించిన 'హంగామా 2' చిత్రం ఈరోజు విడుదల అవుతోంది.
Shilpa Shetty
Husband
Raj Kundra

More Telugu News