Vajra Busses: వేలానికి ‘వజ్ర’.. బస్సులను వదిలించుకోనున్న టీఎస్ఆర్టీసీ

TSRTC Decided to sell Vajra Busses through Tender
షార్ట్స్‌లో చూడండి
ప్రయాణికుల ఆదరణకు నోచుకోని వజ్ర బస్సులను వదిలించుకోవాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఇళ్ల నుంచి ఎక్కించుకుని తీసుకెళ్లేలా ఈ బస్సులను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు నాన్‌స్టాప్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. 21 సీట్లు ఉన్న ఈ బస్సుల్లో యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టారు.

అయితే, సాధారణ బస్సులతో పోలిస్తే ఇందులో చార్జీలు దాదాపు రెండింతలు ఉండడంతో ప్రయాణికుల నుంచి ఆదరణ కరవైంది. వీటి నిర్వహణ భారంగా మారడంతో వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది.  ఈ బస్సులు 100 వరకు ఉండగా ఆదరణ కరవవడంతో 65 మూలనపడ్డాయి. ఈ నేపథ్యంలో స్క్రాప్ యార్డ్ విభాగం ద్వారా వాటి ప్రస్తుత విలువను అంచనా వేసి అనంతరం బహిరంగ వేలానికి టెండరు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు మూడు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది.
Go Back to Shorts
Vajra Busses
Telangana
TSRTC

More Telugu News