Telangana: టెన్త్‌లో సీబీఎస్ఈ విధానం.. ఇకపై రెండుసార్లు బోర్డు పరీక్షలు.. తెలంగాణ ప్రభుత్వం యోచన!

  • సీబీఎస్ఈ విధానంలో స్పల్ప మార్పులు చేసి అమలు
  • నవంబరు/ డిసెంబరులో తొలి అర్ధభాగం పరీక్షలు
  • రెండు పరీక్షల్లోని మార్కుల ఆధారంగా తుది ఫలితాలు
Telangana govt vow to implement CBSE system in class 10th

సీబీఎస్‌ఈ విధానంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా పదో తరగతిలో దానిని ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా రెండుసార్లు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్ఎస్‌సీ బోర్డు) అధికారులు కసరత్తు ప్రారంభించనున్నారు.

తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహించి గ్రేడ్‌లు కేటాయించొద్దన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే టెన్త్ విద్యార్థులు ఇకపై రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. తొలి ఆరు నెలలకు నవంబరు/డిసెంబరులో, ఆ తర్వాతి ఆరు నెలలకు విద్యా సంవత్సరం చివరిలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలు ప్రకటిస్తారు.

More Telugu News