తెలంగాణలో కొత్తగా 648 కరోనా పాజిటివ్ కేసులు

22-07-2021 Thu 20:43
  • గత 24 గంటల్లో 1,14,928 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 82 కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 9,857 మందికి చికిత్స
Telangana corona details

తెలంగాణలో గత 24 గంటల్లో 1,14,928 కరోనా పరీక్షలు నిర్వహించగా, 648 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 59, వరంగల్ అర్బన్ జిల్లాలో 52 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 696 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,39,369 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,25,738 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,857 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,774కి చేరింది.