ఏపీలో కొత్తగా 1,843 కరోనా రోజువారీ కేసులు

22-07-2021 Thu 17:49
  • గత 24 గంటల్లో 70,727 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 301 కేసులు
  • కర్నూలు జిల్లాలో 24 కేసులు
  • రాష్ట్రంలో 12 మంది మృతి
  • ఇంకా 23,571 మందికి చికిత్స
AP witnesses two thousand below new cases

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 70,727 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,843 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 301 కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 235, ప్రకాశం జిల్లాలో 232, తూర్పు గోదావరి జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 203 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 24 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,199 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,48,592 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,11,812 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 23,571 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,209కి పెరిగింది.