దళితులకు జీవించే హక్కు లేనట్టు జగన్ వ్యవహరిస్తున్నారు: ఎమ్మెస్ రాజు

22-07-2021 Thu 16:58
  • రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది
  • కిరణ్ అనే దళితుడిని పోలీసులు కొట్టి చంపారు
  • దళిత సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి?
There is no security for dalits in AP says MS Raju

ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు మండిపడ్డారు. మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో చీరాలలో కిరణ్ కుమార్ అనే దళితుడిని పోలీసులు కొట్టి చంపేశారని... పోలీసులను కిరణ్ తండ్రి మోహన్ రావు కానీ, తాము కానీ ఏమైనా చేస్తే ఈ సీఎం ఊరుకుంటారా? అని అడిగారు.

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మెస్ రాజు దుయ్యబట్టారు. ఏపీలో దళితులకు జీవించే హక్కు లేనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దళితుల పట్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నప్పటికీ దళిత సంఘాలు కానీ, అంబేద్కర్ వాదులు కానీ ఎందుకు మాట్లాడలం లేదని ప్రశ్నించారు. దళితులకు న్యాయం చేయకపోతే త్వరలోనే దళిత సంఘాలతో కలిసి జగన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.