Bhadrachalam: భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్రరూపం... పర్ణశాలలో నీట మునిగిన సీతమ్మ విగ్రహం, స్వామి వారి సింహాసనం

  • ఎస్సారెస్సీ ఎగువన భారీ వర్షాలు
  • పొంగిపొర్లుతున్న గోదావరి
  • ఉదయం నుంచి పెరుగుతున్న నీటిమట్టం
  • స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా మునక
Huge flow in Godavari river at Bhadrachalam

భారీ వర్షాలతో భద్రాద్రి దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎస్సారెస్సీ ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉప్పొంగుతోంది. ఈ ఉదయం నుంచి భద్రాద్రి వద్ద భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో, పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. అటు, సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి.

ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

More Telugu News