భారీ లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

22-07-2021 Thu 12:52
  • లాభాల్లో ట్రేడ్ అవుతున్న అంతర్జాతీయ మార్కెట్లు
  • నిన్న వాల్ స్ట్రీట్ లాభాల్లో ముగియడంతో బలపడిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • 613 పాయింట్ల లాభంతో కొనసాగుతున్న సెన్సెక్స్
Markets trading in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలతో పాటు, గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతుండటం మన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. వాల్ స్ట్రీల్ కూడా నిన్న లాభాలతో క్లోజ్ కావడం మదుపరుల్లో జోష్ ను నింపింది.

మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో సెన్సెక్స్ 613 పాయింట్ల లాభంతో 52,812 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 178 పాయింట్లు పెరిగి 15,810 వద్ద ట్రేడ్ అవుతోంది. పవర్ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. మెటల్, రియాల్టీ సూచీలు 2 శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర సంస్థలు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.