నేరం రుజువైతే శిల్పాశెట్టి భర్తకు ఎంత కాలం శిక్ష పడుతుందంటే..?

22-07-2021 Thu 11:34
  • పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్
  • పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు
  • మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం
Raj Kundra maby sentenced 3 to 5 years jail term if allegations against him proved

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

రాజ్ కుంద్రాపై ఐపీసీ 420 (మోసం), 292, 293 (అశ్లీల, అసభ్య ప్రకటనలను ప్రదర్శించడం), 34 (సాధారణ ఉద్దేశం), ఐటీ చట్టంలోని 67, 67ఏ సెక్షన్లు (మహిళా అసభ్య ప్రాతినిధ్యం) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా తమ వద్ద బలమైన సాక్ష్యాలున్నాయని పోలీసులు చెపుతున్నారు.

మన దేశంలో అశ్లీలతను నియంత్రించేందుకు ఐపీసీ కిందకు ఐటీ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇన్ డీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్స్ యాక్ట్ అండ్ యంగ్ పర్సన్ యాక్ట్ ఐపీసీ ఐటీ యాక్ట్ 2000 కింద అశ్లీల వీడియోలపై నిషేధం విధించారు. రాజ్ కుంద్రాపై ఈ చట్టాల కింద నేరం రుజువైతే మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కేసులో 2013లో రాజ్ కుంద్రాను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.