వ్యవస్థల్లో చంద్రబాబుకు ఉన్న పట్టు అలాంటిది: విజయసాయిరెడ్డి

22-07-2021 Thu 11:12
  • ఓటుకు నోటు కేసులో తనను తాకలేరన్న ధైర్యంతో చంద్రబాబు ఉన్నారు
  • కుట్రలు కుతంత్రాలతో ప్రభుత్వాలను అస్థిరపరచాలనుకుంటున్నారు
  • ఇలాంటి వారి ఆటలు ఎక్కువ కాలం సాగవు
Chandrababu can manage systems says Vijayasai  Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో తన నీడను కూడా తాకలేరన్న ధైర్యంతో చంద్రబాబు ఉన్నారని అన్నారు. వ్యవస్థల్లో ఆయనకున్న పట్టు అలాంటిదని చెప్పారు. అందుకే కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వాలను అస్థిరపరచడానికి సాహసిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వారి ఆటలు ఎక్కువ కాలం సాగవని అన్నారు.

కాలేజీ పేరుతో వందల ఎకరాల మాన్సాస్ భూమిని అమ్మేశారంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని మరో ట్వీట్ ద్వారా విజయసాయిరెడ్డి షేర్ చేశారు. క్యాపిటల్ పేరుతో భూములు కాజేసిన పచ్చ మందకు కాలేజీల పేరుతో కాజేయడం చిన్న విషయమని అన్నారు.