'నాదీ నీది ఒకే కమ్యూనిటీ.. సినిమాల్లో ఛాన్స్ ఇప్పించు' అంటూ బ్ర‌హ్మాజీకి నెటిజ‌న్ ట్వీట్.. స్పందించిన న‌టుడు

22-07-2021 Thu 11:03
  • త‌న‌కు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టమ‌న్న నెటిజ‌న్
  • తాను భార‌తీయుడిన‌ని, తెలుగోడినన్న బ్ర‌హ్మాజీ
  • కులం ఆధారంగా ఛాన్స్ అడ‌గ‌డ‌మేంట‌ని నిలదీత 
brahmaji tweet goes viral

టాలీవుడ్ న‌టుడు బ్ర‌హ్మాజీకి తాజాగా ట్విట్ట‌ర్‌లో ఓ నెటిజన్ ఓ విన్న‌పం చేసుకున్నాడు. 'అన్నా నేను మన కమ్యూనిటీకి చెందిన వాడిని. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మీ తరుఫున ఏ చిన్న అవకాశం ఉన్నా నాకు ఏదో పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించగలరని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నాడు.

దీనిపై బ్ర‌హ్మాజీ స్పందిస్తూ స‌మాధానం ఇచ్చాడు. తాను భార‌తీయుడిన‌ని, తెలుగోడినని, అదే త‌న కమ్యూనిటీ అని చెప్పాడు. సినిమాల్లో అవ‌కాశం కోసం క‌మ్యూనిటీని అడ్డుపెట్టుకోవ‌డం ప‌ట్ల ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. బ్ర‌హ్మాజీ ఇచ్చిన స‌మాధానం ప‌ట్ల నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఈ కాలంలోనూ కులం ఆధారంగా అవ‌కాశాలు ఇవ్వాలంటూ కోర‌డం ఏంట‌ని నెటిజ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.