Microsoft: హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన మైక్రోసాఫ్ట్.. త్వరలోనే అధికారిక ప్రకటన

  • శంషాబాద్ విమానాశ్రయ సమీపంలో కేంద్రం
  • ప్రభుత్వంతో తుది దశకు చేరుకున్న చర్చలు
  • మైక్రోసాఫ్ట్ బాటలో మరో మూడు కంపెనీలు
 Microsoft vow to set up Rs 15k crore data centre in Hyderabad

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో మైక్రోసాఫ్ట్ ఇండియా రూ. 1500 కోట్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. కాగా, మరోమూడు ఐటీ కంపెనీలు కూడా ఇదే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మన దేశంలో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం 30 మెగావాట్లు ఉండగా, 2023 నాటికి ఈ సామర్థ్యం 96 మెగావాట్లకు పెరుగుతుందని కన్సల్టింగ్ సేవల సంస్థ జేఎల్ఎల్ అంచనా వేసింది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యయాలు తక్కువగా ఉండడానికి తోడు ప్రభుత్వ సానుకూల విధానాలు, ఐటీ నిపుణుల లభ్యత ఎక్కువగా ఉండడం వల్లే ఇక్కడ డేటా కేంద్రాల ఏర్పాటుకు కంపెనీలు ముందుకొస్తున్నట్టు సమాచారం. కాగా, అమెజాన్ ఇండియా ఇటీవలే హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేసింది.

More Telugu News