ఏపీలో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు.. నేడు కోస్తాలో అతిభారీ వర్షాలు!

22-07-2021 Thu 08:18
  • ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు
  • కోస్తా తీరం వెంబడి గంటకు 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు
  • రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
Heavy To Very Heavy Rains forecast in Andhrapradesh next todays

ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు విస్తారంగా వానలు కురవనున్నాయి. కోస్తాలో నేడు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల మాత్రం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

అలాగే, కోస్తా తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోపక్క, బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉన్నట్టు వివరించింది. దీని ప్రభావంతో రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది.