Kerala: కేరళలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. రెండు రోజుల పాటు పూర్తి లాక్ డౌన్

  • 24, 25 తేదీల్లో పూర్తి లాక్ డౌన్
  • టెస్టింగులను పెంచాలని ప్రభుత్వ నిర్ణయం
  • పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి
Kerala to impose two days lockdown

ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేరళలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరోసారి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24, 25 (శనివారం, ఆదివారం) తేదీల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది.

అంతేకాదు కరోనా టెస్టింగులను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం రోజున అదనంగా 3 లక్షల పరీక్షలు చేయాలని నిర్ణయించింది. పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి సారించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

More Telugu News