డీకే, సిద్ధరామయ్యలను ఢిల్లీకి పిలిపించి తలంటిన కాంగ్రెస్ అధిష్ఠానం

21-07-2021 Wed 20:18
  • డీకే, సిద్ధరామయ్యల మధ్య ఆధిపత్య పోరు
  • ఎవరికీ అధిక ప్రాధాన్యత ఉండదన్న రాహుల్
  • ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించబోమన్న రణదీప్ సూర్జేవాలా
DK Shivakumar and Sidharamaiah meets Rahul Gandhi

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యల మధ్య వివాదం ముదురుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ వారిద్దరినీ ఢిల్లీకి పిలిపించుకుంది. మీ ఇద్దరిలో ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించబోమని కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి రణదీప్ సూర్జేవాలా వారికి స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి పని చేయాల్సిందేనని చెప్పారు.

మరోవైపు వీరిద్దరితో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఇద్దరినీ సమానంగానే చూస్తామని, ఎవరికీ అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఉండదని రాహుల్ స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో శివకుమార్ మాట్లాడుతూ, కర్ణాటక కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. అందరం కలిసే ముందుకు సాగుతామని తెలిపారు.