ఇటలీ నుంచి తిరిగొచ్చిన ప్రభాస్.. వీడియో వైరల్

21-07-2021 Wed 19:12
  • శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న వీడియో వైరల్
  • జుట్టును బీనీతో కప్పిన ప్రభాస్
  • 'రాధేశ్యామ్' షూటింగ్ కోసం ఇటలీకి వచ్చినట్టు సమాచారం
Prabhas returns from Italy

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీ షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ కు తిరిగొచ్చాడు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఈరోజు బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన జుట్టును ప్రభాస్ బీనితో కప్పినట్టు వీడియోలో కనిపిస్తోంది. కళ్లజోడు, స్నీకర్స్ తో పాటు తెల్లటి మాస్క్ ను ప్రభాస్ ధరించాడు.

'రాధేశ్యామ్' షూటింగ్ కోసమే ప్రభాస్ ఇటలీకి వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా, మరి కొన్ని చిత్రాలు ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి. 'రాధేశ్యామ్'తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'సలార్', దర్శకుడు ఓంరౌత్ తో 'ఆదిపురుష్', దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం చేస్తున్నాడు.