గోపీచంద్ జోడీగా నభా నటేశ్!

21-07-2021 Wed 18:57
  • యూత్ లో మంచి క్రేజ్
  • తాజా చిత్రంగా 'మాస్ట్రో'
  • హిట్ కోసం వెయిటింగ్
  • శ్రీవాస్ మూవీలో ఛాన్స్  
Nabha Natesh in Gopichand movie

తెలుగు తెరకు ఈ మధ్య కాలంలో పరిచయమైన గ్లామరస్ హీరోయిన్లలో నభా నటేశ్ ఒకరు. 'నన్నుదోచుకుందువటే' సినిమాతో పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ, 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత రవితేజ .. సాయితేజ్ .. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన వరుసగా అవకాశాలైతే వచ్చాయిగాని విజయాలు మాత్రం దక్కలేదు. అలాంటి నభా తాజా చిత్రంగా 'మాస్ట్రో' సినిమా రూపొందింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, త్వరలోనే విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

ఈ క్రమంలో గోపీచంద్ సరసన నభా అవకాశాన్ని దక్కించుకున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. దర్శకుడు శ్రీవాస్ .. గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. గతంలో శ్రీవాస్ - గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్యం' .. 'లౌక్యం' సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఆ తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నభా నటేశ్ ను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. నభా మంచి పొడగరి .. అందువలన తెరపై ఈ జోడీకి మంచి మార్కులు పడే అవకాశాలు ఎక్కువే. ఈ సినిమాతో గోపీచంద్ - శ్రీవాస్ హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.