Sajjala Ramakrishna Reddy: పొత్తుల రాజకీయాలు చేయడం జగన్ కు రాదు: సజ్జల

YSRCP will not do caste politics says Sajjala Ramakrishna Reddy
  • వెనుకబడిన వర్గాల ఉనికిని కాపాడేందుకే 56 కార్పొరేషన్లు
  • కుల రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలను వైసీపీ చేయదు
  • ప్రతి సంక్షేమ పథకం ద్వారా ప్రజలు లబ్ధి పొందాలనేదే జగన్ లక్ష్యం
వెనుకబడిన వర్గాల ఉనికిని కాపాడేందుకే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కుల రాజకీయలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ కాదని అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని రాజకీయాలు చేయడం సీఎం జగన్ కు రాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం ద్వారా ప్రజలు లబ్ధి పొందాలనేదే జగన్ లక్ష్యమని అన్నారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sajjala Ramakrishna Reddy
Jagan
YSRCP
Corporations

More Telugu News